హైదరాబాద్: 28°C
తెలంగాణ

దేగామలో డిజిటల్ క్రాప్ సర్వే

ADB: బజారాహత్నూర్ మండలం దేగామ గ్రామంలో డీసీఎస్ టీఎల్ కార్యక్రమంలో భాగంగా క్షేత్రస్థాయి సర్వే నిర్వహించారు. ప్రైవేట్ సర్వేయర్ సతీష్ ఆధ్వర్యంలో పంట పొలాలను సందర్శించి సాగు పరిస్థితులను పరిశీలించారు. పంటల వివరాలు, సాగు విస్తీర్ణం తదితర అంశాలను నమోదు చేశారు. రైతులతో పంటల సాగు పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. ఏఈవో ప్రవీణ్, రైతులు పాల్గొన్నారు.