NGKL: కమ్మా రెడ్డిపల్లి గ్రామంలో మురుగునీటి సమస్య తీవ్రంగా మారింది. గ్రామంలోని ప్రధాన రహదారిపై మురుగునీరు పారుతుండటంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై ఇప్పటికే పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడమే ఈ సమస్యకు ప్రధాన కారణమని అంటున్నారు.
తెలంగాణ
రోడ్డుపైనే మురుగునీరు.. పాదచారులకు నరకయాతన


