అల్లూరి జిల్లాలోని 170 మంది కాఫీ రైతులకు పీఎంఎఫ్‌ఎంఈ పథకం కింద రూ.1.60 కోట్ల రుణాన్ని సీఎం చంద్రబాబు నాయుడు శనివారం అందజేశారు. అరకులోయ మండలం గన్నెల గ్రామంలో సంజీవని పైలట్ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి హాజరైన సీఎం రైతులకు చెక్కును అందించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కాఫీ రైతులకు రూ.1.60 కోట్ల రుణం


