హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వాలంటీర్ల సేవలను వినియోగించుకోవాలి: కలెక్టర్

కృష్ణా: మచిలీపట్నం కలెక్టరేట్లో మండల ప్రత్యేక అధికారులు, విద్యాశాఖ అధికారులతో కలెక్టర్ బాలాజీ శనివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు వెనుకబడిన విద్యార్థులకు బోధన అందిస్తున్న వాలంటీర్ల సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని ఆదేశించారు.