హైదరాబాద్: 28°C
తెలంగాణ

MBBS విద్యార్థిని ఆత్మహత్య

HYD: RTC X రోడ్స్‌లో విషాదం చోటుచేసుకుంది. కర్నూలుకు చెందిన MBBS విద్యార్థిని యశ్విత అపరాజిత హాస్టల్‌లో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. నీట్ పీజీ పరీక్షకు సిద్ధమవుతూ రేపే పరీక్ష ఉండటంతో మానసిక ఒత్తిడికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 6 నెలలుగా హైదరాబాద్‌లో ఉంటున్న యశ్విత మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.