హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాజ్యాంగం ద్వారానే తెలంగాణ ఏర్పాటు: మంత్రి

JGL: అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. గొల్లపల్లి మండలంలోని దట్నూర్‌లో శనివారం అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా సమాజంలోని అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందని అన్నారు. త్వరలోనే అంబేద్కర్ సంఘ భవనాలను పూర్తి చేస్తామన్నారు.