హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

KMR: విద్యుత్‌ లైన్ల మరమ్మతులు, కొత్త స్తంభాల ఏర్పాటు పనుల కారణంగా బాన్సువాడ పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం విద్యుత్‌ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ సంతోష్‌కుమార్‌ తెలిపారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు వాసవికాలనీ, కోటగల్లి, బీడీకాలనీ, ఆర్ఫత్‌కాలనీ, ఫిర్దోస్‌కాలనీ, బాలాజీనగర్‌ తదితర ప్రాంతాల్లో సరఫరాకు అంతరాయం ఉంటుందని తెలిపారు.