హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఇస్మాయిల్ ఇంటి ముందు మౌలానా బంధువులు ధర్నా

BDK: బూర్గంపాడు మండలం జింకలగూడెంలో మౌలానా మృతి ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. మౌలానా మృతిపై ఆయన బంధువులు ఆందోళనకు దిగారు. ఇస్మాయిల్ ఇంటి ముందు మౌలానా మృతదేహాన్ని ఉంచి ధర్నా చేపట్టారు. మౌలానా మృతికి గల కారణాలను వెల్లడించాలని, ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి తమకు న్యాయం చేయాలని బంధువులు డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు.