హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: జంట హత్యలపై ఎస్పీ తీవ్ర విచారణ

SRPT: మేళ్లచెరువు ఎర్రగట్టు తండా జంట హత్యల ఘటనాస్థలాన్ని ఎస్పీ నరసింహ పరిశీలించారు. డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, సీఐ చరమందా రాజుతో వివరాలు ఆరా తీశారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చి, నిందితులకు ఉరిశిక్ష పడేలా కఠిన చర్యలు తీసుకుంటామని భరోసానిచ్చారు. కేసు దర్యాప్తు వేగవంతం చేసి నిందితులను వెంటనే పట్టుకోవాలని పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు.