హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ ఐటీఐలో న్యాయ విజ్ఞాన సదస్సు

ELR: నూజివీడు పట్టణంలోని ప్రభుత్వ ఐటిఐ కళాశాల ఆవరణములో శనివారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. నూజివీడు ఒకటవ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ ఓ అనూష మాట్లాడుతూ.. విద్యార్థి దశలో చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. వ్యసనాలకు బానిస కాకుండా చదువుపై శ్రద్ధ వహించి తల్లిదండ్రులకు, సమాజానికి మంచి పేరు తేవాలన్నారు.