WGL: గ్రేటర్ వరంగల్ పరిధిలో ఆస్తి పన్నుల వసూళ్లను వేగవంతం చేయాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ తేజావత్ వెంకన్న అధికారులను శనివారం ఆదేశించారు. సర్కిల్, వార్డు వారీగా లక్ష్యాలను నిర్దేశించి రోజువారీ వసూళ్ల పురోగతిని పర్యవేక్షించాలని సూచించారు. భారీగా పన్ను బకాయిలున్న డిఫాల్టర్లపై ప్రత్యేక దృష్టి సారించి ఆర్‌ఆర్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
తెలంగాణ
పన్ను వసూళ్లలో వేగం పెంచాలి: కమిషనర్


