హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉత్సాహభరితంగా 2 కే రన్

BDK: జిల్లా యువజన & క్రీడల శాఖ (DY&SO) ఆధ్వర్యంలో ఇవాళ 2K రన్ అత్యంత ఉత్సాహభరితంగా సాగింది. కొత్తగూడెం రైల్వే స్టేషన్ ప్రాంగణం నుంచి ప్రారంభమైన ఈ రన్‌ను ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ రన్ ప్రకాశం స్టేడియం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ దేశానికి అందించిన సేవలను కొనియాడారు.