హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెరువులో కెమికల్స్.. 10 టన్నలు చేపలు మృతి

HYD: బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రా చెరువు అర్థరాత్రి కెమికల్‌ను చెరువులోకి వదలడంతో 10 టన్నులకు పైగా చేపలు మృతి చెందాయి. ఈ ఘటనతో మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయారు. వారి జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో ప్రభుత్వం తక్షణమే స్పందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కెమికల్‌ను చెరువులోకి వదిలన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.