హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే

E.G: రైతులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, యంత్ర పరికరాలు వినియోగించి అధిక లాభాలు సాధించాలని రాజానగరం MLA బత్తుల బలరామకృష్ణ సూచించారు. కోరుకొండలో శనివారం నిర్వహించిన ఆత్మ కిసాన్ మేళా, వ్యవసాయ ప్రదర్శనలో ఆయన పాల్గొన్నారు. రైతులకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రుడా ఛైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, తదితరులు పాల్గొన్నారు.