హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: బైక్ అదుపుతప్పి యువకుడి మృతి

MLG: తాడ్వాయి మండలంలోని కొడిశాల సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం అందులగూడెం గ్రామానికి చెందిన కుంజ ప్రభాకర్ మృతి చెందాడు. ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తాపడటంతో ప్రభాకర్ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు.