హైదరాబాద్: 28°C
తెలంగాణ

హామీలు అమలలో కాంగ్రెస్ విఫలం: BRS

KMM: కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలను అమలు చేయడంలో విఫలమైందని మాజీ జడ్పీ ఛైర్మన్‌ లింగాల కమల్‌రాజు ఆరోపించారు. శనివారం ముదిగొండ మండలం చిరుమర్రిలో ఆయన మాట్లాడుతూ.. రైతులు, మహిళలు, యువత, నిరుద్యోగులు, ఉద్యోగులు, పేదల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. సెప్టెంబర్‌ 2 నుంచి 8 వరకు పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టనున్నట్లు తెలిపారు.