హైదరాబాద్: 28°C
తెలంగాణ

'జలసిరి లక్ష్యసాధనకు కృషి చేయాలి'

MNCL: జన్నారం మండలంలోని అన్ని గ్రామాలలో జలసిరి పథకం లక్ష్యాలను సాధించేందుకు అధికారులు, సిబ్బంది కృషి చేయాలని పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు సూచించారు. శనివారం మధ్యాహ్నం జన్నారం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు ఎంపీడీవో ఉమర్ షరీఫ్, పంచాయతీ రాజ్, ఈజీఎస్ అధికారులు హాజరయ్యారు. ప్రజలు ఇంకుడు గుంతలు నిర్మించుకునేలా ప్రోత్సహించాలన్నారు.