హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలేరమ్మ ఆదాయం రూ. 15.92 లక్షలు

GNTR: కాకుమాను మండలం కొండపాటూరులోని పోలేరమ్మ అమ్మవారి దేవస్థాన హుండీ లెక్కింపును శనివారం దేవాదాయ శాఖ బాపట్ల ఇన్‌స్పెక్టర్ పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ హుండీ ద్వారా రూ. 15,92,629 ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు. ఇది గత లెక్కింపు కంటే రూ. 3,26,901 ఎక్కువ కావడం విశేషం. కార్యక్రమంలో ఆలయ ఈవో జక్కా శ్రీనివాసరావు పాల్గొన్నారు.