MLG: వెంకటాపూర్ మండలంలోని యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవత్సవ, ఆయన సతీమణి, సికింద్రాబాద్ డీఆర్ఎం డాక్టర్ గోపాల కృష్ణన్ సందర్శించారు. అర్చకులు హరీష్ శర్మ, ఉమాశంకర్ స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేయించారు. ఈవో ఉమ్మడి భాస్కర్ శాలువాతో సత్కరించారు. గైడ్ వెంకటేష్ ఆలయ చరిత్ర, శిల్పకళను వివరించారు.
తెలంగాణ
రామప్పను సందర్శించిన సౌత్ సెంట్రల్ రైల్వే GM


