హైదరాబాద్: 28°C
తెలంగాణ

మేయర్‌ను పరామర్శించిన అర్బన్ ఎమ్మెల్యే

NZB: నిజామాబాద్‌ కసాబ్‌గల్లీలో మేయర్‌ ఉమారాణిని అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్తా శనివారం పరామర్శించారు. ఇటీవల మృతి చెందిన ఆమె మాతృమూర్తి చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. మాతృమూర్తి మృతిపై విచారం వ్యక్తం చేస్తూ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన వెంట పలువురు కార్పొరేటర్లు, బీజేపీ నాయకులు ఉన్నారు.