హైదరాబాద్: 28°C
తెలంగాణ

'భూముల రీ సర్వే పారదర్శకంగా నిర్వహించాలి'

PDPL: ఎలిగేడు మండలం లోకపేటలో కొనసాగుతున్న భూముల రీ సర్వే కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ శ్రీరాములు శనివారం పరిశీలించారు. సర్వే పురోగతి, భూముల కొలతలు, సరిహద్దుల నిర్ధారణ అంశాలను పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. రీ సర్వేను రైతులకు ఇబ్బందులు కలగకుండా అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. లైసెన్సుడ్ సర్వేయర్ రోజుకు 40 ఎకరాలు సర్వే చేయాలన్నారు.