PDPL: పాలకుర్తి మండలం పుట్నూరులో వరి, పత్తి పంటలను శాస్త్రవేత్తల బృందం శనివారం పరిశీలించింది. కూనారం ఏఆర్ఎస్ హెడ్ డా. సతీష్‌చంద్ర, రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డా. సంపత్ రైతులకు సూచనలు చేశారు. వరిలో కాండం తొలుచు పురుగు, అగ్గితెగులు, పత్తిలో తామర పురుగు, పచ్చదోమ ఉధృతి గుర్తించారు. సకాలంలో నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.
తెలంగాణ
వరి, పత్తి పంటలను పరిశీలించిన శాస్త్రవేత్తల బృందం


