హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేపాల్ వరద‌ల్లో జిల్లా వాసి

WNP: నేపాల్ వరదల్లో వీపనగండ్ల మండలానికి చెందిన పుట్ట శ్వేత చిక్కుకున్నట్లు వారి కుటుంబం తెలిపింది. శ్వేతకు ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాకు చెందిన సురేశ్ రెడ్డితో వివాహం కాగా వీరి కుటుంబం అమెరికాలో ఉంటుంది. ఇటీవల ఈశా ఫౌండేషన్ తరఫున మానససరోవర యాత్రకు ఆమె వెళ్లారు. వరదల నేపథ్యంలో ఇప్పటి వరకు ఆమె నుంచి ఎటువంటి స్పందన అందలేదని బాధితులు తెలిపారు.