హైదరాబాద్: 28°C
తెలంగాణ

కర్రసాములో జాతీయ పతకాలు.. ఆర్ధిక ఇబ్బందుల్లో క్రీడాకారులు

MNCL: జాతీయ స్థాయి కర్రసాము పోటీల్లో మంచిర్యాల విద్యార్థులు పులిశెట్టి శృతి, దొంతుల వర్ష అద్భుతమైన ప్రతిభ కనబరుస్తూ జిల్లాకు జాతీయ స్థాయి గుర్తింపు తీసుకువస్తున్నారు. ఇటీవల మలేషియాలో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో శృతి స్వర్ణ పతకం, వర్ష రజత పతకం సాధించి దేశ కీర్తిని ఇనుమడింపజేశారు. ప్రపంచకప్ పోటీలకు అర్హత సాధించినా, ఆర్థిక ఇబ్బందుల కారణంగా వారు వెళ్లలేకపోయారు.