హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఆరుతడి పంటల సాగుకు ముందుకు రావాలి'

AKP: కరువు పరిస్థితుల నేపథ్యంలో ఆరుతడి పంటల సాగు మేలని ఎన్.జీ. రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పి.వి. సత్యనారాయణ సూచించారు. పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్.రాయవరం మండలాల్లో పర్యటించి పంటలను పరిశీలించారు. జిల్లాలో 56,500 హెక్టార్ల వరి సాగు లక్ష్యం కాగా ఇప్పటివరకు 7,300 హెక్టార్లలో మాత్రమే నాట్లు వేశారన్నారు.