VZM: బొబ్బిలి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద శనివారం వీర బొబ్బిలి మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అధ్యక్షుడు బొమ్మినేని తిరుపతిరావు నేతృత్వంలో రోగులు, సహాయకులు, పేదలకు భోజనం పంపిణీ చేశారు. పేదలకు అన్నదానం చేయడం ఎంతో సంతృప్తినిస్తుందని, సేవా కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని తిరుపతిరావు పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
సేవా కార్యక్రమాల్లో మాజీ సైనికులు ముందడుగు


