హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంగన్‌వాడీ కేంద్రాలకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు

ములుగు సర్కిల్ పరిధిలోని 630 అంగన్‌వాడీ కేంద్రాలకు ఉచితంగా విద్యుత్ కనెక్షన్లు అందించినట్లు ఎన్పీడీసీఎల్ సూపెరింటెండింగ్ ఇంజనీర్ బి.బిక్షపతి తెలిపారు. విద్యుత్ సౌకర్యంతో ఫ్యాన్లు, లైట్లు, తాగునీటి మోటార్లు, ఇతర పరికరాలను వినియోగించుకోవచ్చని చెప్పారు. చిన్నారులకు మెరుగైన విద్యా వాతావరణం, పోషకాహారం, ఆరోగ్య పరిరక్షణకు విద్యుత్ సౌకర్యం దోహదపడుతుందన్నారు.