JGL: ఉగ్ర నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణానికి రూ.10 కోట్లు కేటాయించామని, అందరి అభిప్రాయాలతోనే పనులు చేపడతామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. శనివారం ధర్మపురి ఆలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. పుష్కరాల పనులకు మరో రూ.40 కోట్లు రానున్నాయని మంత్రి పేర్కొన్నారు. సమావేశంలో దేవాదాయ కమిషనర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్ రాజాగౌడ్, ఆర్డీవో మధుసూదన్ పాల్గొన్నారు.
తెలంగాణ
'ఆలయ పునర్నిర్మాణానికి రూ.10 కోట్లు'


