హైదరాబాద్: 28°C
తెలంగాణ

పద్మశాలి సంఘం నూతన పాలకవర్గానికి విప్ శుభాకాంక్షలు

SRCL: వేములవాడ పట్టణ పద్మశాలి సంఘం నూతన పాలకవర్గం ఏర్పడిన అనంతరం తొలిసారిగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు. నూతన పాలకవర్గానికి ఆది శ్రీనివాస్ శుభాకాంక్షలు తెలిపారు. పద్మశాలి సంఘం అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.