హైదరాబాద్: 28°C
తెలంగాణ

దివ్యాంగురాలికి ఎమ్మెల్యే భరోసా

KNR: గంగాధర మండలంలోని వెంకటాయపల్లికి చెందిన కూలీలు వెంకటి–హారికల కుమార్తె రజిత పుట్టుకతోనే దివ్యాంగురాలు. ఈ విషయం తెలుసుకున్న చొప్పదండి ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం శనివారం ఆ చిన్నారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. కుటుంబానికి అండగా ఉంటామని తల్లిదండ్రులకు భరోసానిచ్చారు. రజితకు వెంటనే దివ్యాంగుల పెన్షన్ మంజూరు చేయాలని అధికారులను ఫోన్‌లో ఆదేశించారు.