హైదరాబాద్: 28°C
తెలంగాణ

SIR నోటీసుల ప్రక్రియను పరిశీలించిన మున్సిపల్‌ కమిషనర్‌

KMM: కల్లూరు మున్సిపాలిటీ పరిధిలో ఓటర్లకు అందిన ఎస్‌ఐఆర్‌ నోటీసులకు సంబంధించిన ప్రక్రియను మున్సిపల్‌ కమిషనర్‌ జి. సాయికృష్ణారెడ్డి శనివారం పరిశీలించారు. రికార్డులు, దరఖాస్తులు, ప్రజల నుంచి అందుతున్న వివరాలు, అభ్యంతరాలను పరిశీలించారు. నిబంధనల ప్రకారం పారదర్శకంగా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులు, బీఎల్‌ఓలకు సూచించారు.