హైదరాబాద్: 28°C
తెలంగాణ

'దివ్యాంగుల సదరం క్యాంపులకు హాజరు కావాలి'

SRCL: ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఆధ్వర్యంలో దివ్యాంగుల సదరం క్యాంపులు నిర్వహించనున్నారు. కంటి చూపు, వినికిడి, అర్థోపెడిక్, మానసిక వైకల్యాలకు సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తారు. సంబంధిత తేదీల్లో దివ్యాంగులు ఉదయం 9 గంటలకు సదరం కేంద్రానికి హాజరుకావాలి. మెడికల్ డాక్యుమెంట్లు, ఎక్స్‌రేలు, UDID అప్లికేషన్ ఫారం, ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు తీసుకురావాలని కోరారు.