హైదరాబాద్: 28°C
తెలంగాణ

నూతన అంగన్‌వాడీ కేంద్రం ప్రారంభం

KNR: చిన్నారుల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలో నిర్మించిన నూతన అంగన్‌వాడీ కేంద్రాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. నాణ్యమైన పౌష్టికాహారం బాలింతలు, చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొన్నారు.