NZB: ధర్పల్లి మండలం రామడుగు, మైలారం, ధర్పల్లి, ఓన్నజీపేట్ గ్రామాల్లో యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని మండల వ్యవసాయ అధికారి వెంకటేశ్‌నేత తెలిపారు. శనివారం రామడుగు, మైలారం సొసైటీల పరిధిలో 100 టన్నుల యూరియాను నిల్వ ఉంచినట్లు చెప్పారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సొసైటీల పరిధిలోని గ్రామాల్లో యూరియా బస్తాలు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు.
తెలంగాణ
యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయి: AO


