హైదరాబాద్: 28°C
తెలంగాణ

పౌర హక్కులపై అవగాహన కల్పించిన తాహసీల్దార్

WGL: నల్లబెల్లి మండలం రామతీర్థం గ్రామంలో పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ ముప్పు కృష్ణ మాట్లాడుతూ.. రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు. వివక్షకు వ్యతిరేకంగా పోరాడాలని, ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై ఎంపీడీవో తదితరులు పాల్గొన్నారు.