హైదరాబాద్: 28°C
తెలంగాణ

చేనేత కళాకారులకు సన్మానం

BHNG: ఆలేరు పోచమ్మతల్లి దేవాలయంలో శ్రావణమాస పౌర్ణమి నుంచి ప్రారంభమయ్యే బోనాల జాతర కోసం చేనేత కళాకారులు ప్రత్యేకంగా సారె చీరను తయారు చేస్తున్నారు. ఆలయంలో ఏర్పాటు చేసిన మగ్గంపై చీరను నేస్తున్నారు. శనివారం భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి గుజ్జ అశోక్‌ కళాకారులను సన్మానించారు.