SRCL: జిల్లాలో 41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8 వరకు నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ అంజేలా ఆల్ఫ్రెడ్ తెలిపారు. నేత్రదానం ద్వారా ఇద్దరికి చూపు ప్రసాదించవచ్చన్నారు. మరణించిన 6 గంటల్లోపు నేత్రాలను సేకరించవచ్చని, నేత్రదానం చేయడానికి వయస్సు అడ్డంకి కాదన్నారు.
తెలంగాణ
'నేత్రదానం చేసి మరో ఇద్దరికి చూపునివ్వాలి'


