హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ఎస్సై

NGKL: బోనాల పండుగ ఊరేగింపుల్లో డీజేలు ఉపయోగిస్తే సీజ్ చేసి నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తామని కల్వకుర్తి ఎస్సై హెచ్చరించారు. ఊరేగింపులను ప్రశాంత వాతావరణంలో రాత్రి 8 గంటలలోపు పూర్తి చేసుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా నిర్వాహకులదే పూర్తి బాధ్యత అని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని తెలిపారు.