హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డ్రైనేజ్ సమస్య పరిష్కారానికి చర్యలు

AKP: కోటవురట్ల మండలం కొడవటిపూడిలో డ్రైనేజ్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఎంపీడీవో చంద్రశేఖర్ తెలిపారు. దీనిలో భాగంగా శనివారం నుంచి డ్రైనేజ్ కాలువలో జేసీబీతో పూడికను తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. మురికి కాలువలో నీరు నిలిచిపోకుండా ఉండేందుకు గెడ్డలోకి మురికి నీరు పోయే విధంగా పనులు చేపట్టాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.