MNCL: ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన తెలంగాణ కార్మికులు రాఖీ పౌర్ణమి ఘనంగా నిర్వహించుకున్నారు. రక్షాబంధన్ సందర్భంగా తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి ఆధ్వర్యంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కల్లెడ భూమన్న, యూఏఈ దుబాయ్ శాఖ అధ్యక్షులు ఏరుకల రాజుగౌడ్, తదితరుల ఆధ్వర్యంలో రాఖీలు కట్టుకుంటూ పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
తెలంగాణ
రక్షాబంధన్ నిర్వహించిన గల్ఫ్ కార్మికులు


