హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: పొన్నం

HNK: 'పల్లె పల్లెకు పొన్నం అన్న'లో భాగంగా దండేపల్లిలో మంత్రి పర్యటించారు. ప్రజల సమస్యలు విని అధికారులకు ఆదేశాలిచ్చారు. నూతన జీపీ, వీఓ భవనాలు, సీసీ రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. రైతులు ఆరుతడి పంటలు సాగుచేయాలని సూచించారు. యువత కోసం ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తామని, దండేపల్లిని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.