హైదరాబాద్: 28°C
తెలంగాణ

BCహాస్టల్ వర్కర్ల వేతనాలు పెంచాలి: CITU

గద్వాలలోని జిల్లా బీసీ సంక్షేమ అధికారి శ్రీ సయ్యద్ అక్బర్ పాషాకు పార్ట్‌టైం వర్కర్ల సమస్యలపై శనివారం సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఉప్పేర్ నరసింహ వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. బీసీ హాస్టళ్లలో 23 ఏళ్లుగా సేవలందిస్తున్న కార్మికులకు వేతనాలు పెంచాల్సింది పోయి రూ.5,200కు తగ్గించడం అన్యాయమన్నారు. తక్షణమే కనీస వేతనం రూ.26,000 అమలు చేయాలన్నారు.