హైదరాబాద్: 28°C
తెలంగాణ

లేగ దూడపై చిరుత పులి దాడి

MDK: తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లి అటవీ ప్రాంతం వద్ద చిరుత పులి దాడి చేసి లేగ దూడను చంపి తిన్నట్లు అటవీ అధికారులు తెలిపారు. గ్రామానికి చెందిన వెంకటేష్ అటవీ ప్రాంతం వద్ద లేగ దూడను కట్టేసి ఉంచగా నిన్న చిరుత పులి దాడి చేసి చంపి తిన్నట్లు వివరించారు. అడవిలో చిరుత పులి సంచరిస్తున్నందున జాగ్రత్తలు పాటించాలని అటవీ అధికారులు రైతులకు సూచించారు