హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రామేశ్వరంలో భక్తుల పూజలు

KMR: బిక్కనూరు కేంద్రంలోని సిద్ధిరామేశ్వర ఆలయంలో శనివారం శ్రావణమాసం సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయంలోని మూలభావి నీటితో తలస్నానాలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అభిషేకాలు, అర్చనలు చేశారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఆలయ పునర్నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో వసతులు కల్పించారు.