హైదరాబాద్: 28°C
క్రీడలు

ముఖం చాటేసిన గంభీర్.. మాజీ ఓపెనర్ ఫైర్

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై మాజీ ఓపెనర్ సదగోపన్ రమేశ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు. శ్రీలంకతో రెండో టెస్టు డ్రా కావడంతో గంభీర్ ముఖం చాటేశాడని మండిపడ్డాడు. గంభీర్ భారత్ విజయం సాధించినప్పుడే మీడియా ముందుకు వస్తాడని, లేదంటే ఆ బాధ్యతను యువ ఆటగాళ్లకు అప్పగిస్తాడని ఆరోపించాడు. కాగా లంకతో రెండో టెస్టు అనంతరం గంభీర్ మీడియాతో మాట్లాడలేదు.