హైదరాబాద్: 28°C
తెలంగాణ

అధ్వానంగా మారిన ప్రధాన రహదారి

JGL: మెట్పల్లి(M) వెల్లుల్ల గ్రామంలోని ప్రధాన రహదారి గుంతలమయంగా మారి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామ యువజన సంఘాల సభ్యులు తెలిపారు. సమస్యను పరిష్కరించి కొత్త రహదారి నిర్మించాలని కోరుతూ శనివారం పంచాయతీ కార్యదర్శి నారాయణకు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరగా చర్యలు చేపట్టాలని అన్నారు.