BHPL: కాటారం కేజీబీవీలో తెలుగు భాషా దినోత్సవం, జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. గిడుగు రామమూర్తి, ధ్యాన్ చంద్‌లకు నివాళులర్పించిన అనంతరం విద్యార్థినుల పాటలు, నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఒక్క ఆంగ్ల పదం వాడకుండా మాట్లాడటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రిన్సిపల్ చల్ల సునీత విజేతలకు సర్టిఫికెట్లు అందజేశారు.
తెలంగాణ
ఘనంగా తెలుగు భాషా, క్రీడా దినోత్సవాలు


