BDK: బూర్గంపాడు (M) జింకలగూడెంలో ఈ నెల 23న జరిగిన హత్యాయత్నం ఘటనలో తీవ్రంగా గాయపడిన మౌలానా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఆగ్రహించిన కొందరు నిందితుడు ఇస్మాయిల్ ఇంటికి నిప్పంటించేందుకు ప్రయత్నించడంతో ఇల్లు పాక్షికంగా దెబ్బతింది. సమాచారం అందుకున్న ఎస్సై, సిబ్బంది అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
తెలంగాణ
మౌలానా మృతి... నిందితుడి ఇల్లు ధ్వంసం


