హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఘనంగా చౌడేశ్వరి జ్యోతి ఉత్సవాలు

NRPT: మద్దూరు పట్టణంలో శ్రీ చౌడేశ్వరి దేవి జ్యోతి ఉత్సవాలను శనివారం ఘనంగా నిర్వహించారు. తొగుటవీర కులస్తుల ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రత్యేకంగా అలంకరించిన జ్యోతిని పురవీధుల్లో ఊరేగించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు, యువత ఉత్సాహంగా పాల్గొని ఉత్సవాన్ని విజయవంతం చేశారు.