ఖమ్మం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా గోపవరం సర్పంచ్ అబ్బూరి నరహరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్‌ను మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాతో సత్కరించారు. తన ఎన్నికకు సహకరించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల, పొంగులేటి మరియు జిల్లా సర్పంచులకు నరహరి కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా అబ్బూరి నరహరి


